బిఎంఐ, బిపికి సంబంధం ఉండటంతో… ఉబకాయం ఉన్నవారిలో బీపి ప్రమాదం 41 శాతం
ఐహెచ్‌ఎల్ కేర్ సర్వేలో పలు ఆసక్తి విషయాలు వెల్లడి
హైదరాబాద్: అధిక బరువు, ఊబకాయ, అధిక రక్తపోటు, మెటబాలిక్ డిజార్డర్స్‌తో వచ్చే నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు( ఎన్సీడీలు) దేశ వ్యా ప్తంగా ఎక్కువ అవుతున్నాయి. వీటిలో అధిక రక్తపోటు, ఊబకాయంతో ప్రమాదం రెట్టింపుయ్యి, గుండె కవాటాల వ్యాధులు వస్తాయి. ఇటీవల యువతలో గుండెపోటు రావడం గణనీయంగా పెరిగింది. అధిక రక్తపోటు ఊబకాయంతో భారతీయులకు ఇబ్బందులు రెట్టింపు అవుతున్నాయి. వీరిలో ఇవి గుండె కవాటాల వ్యాధులు పెరగడానికి ఎలా కారణమవుతుందో తెలియజేసేందుకు ముఖ్యంగా మెట్రో నగరాల్లో నివసించే వారికి, కార్పొరేట్ సంస్దలో పనిచేసేవారికి అవగాహన కల్పించేందుకు ఇండియా హెల్త్ లింక్ హీల్ ఫౌండేషన్ సహకారంతో ఇండియన్ హార్ట్ లాకింగ్ కేర్ అధ్యయనాన్ని నిర్వహించింది. సరైన అవగాహన లేకపోవడంతో వస్తున్న వ్యాధులను నివారించడం ఎంత అవసరమన్న విషయాన్ని అందరికి తెలియజేయడమే ఈ అధ్యయనం లక్షమన్నారు.
ఐహెచ్‌ఎల్‌కేర్ అధ్యయనం ప్రకారం అధిక బరువు,ఊబకాయం ఉంటే బీపి ప్రమాదం 41శాతం పెరుగుతుందని తెలింది. ఎందుకంటే బీఎంఐకి, బీపికి మధ్య బలమైన సంబంధం ఉంది. ఊబకాయం , అదిక బరువు ఉన్న వారిలో ఎక్కువమందికి అధిక రక్తపోటు(30శాతం) బిపీ రిస్క్-(-53 శాతం ) ఉంటుంది. స్దూలకాయం, అధిక రక్తపోటు రెండు సమస్యలూ ఉన్న 2640 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయుల్లో 53శాతం మందికి సివిడీలు వచ్చే సివిడిల ప్రమాదం ఎక్కువగా ఉందని కూడా పరిశీలనలో తేలింది. బీఎంఐ, బీపి ముప్పు మధ్య సంబంధం గురించి ఐహెచ్‌ఎల్ కేర్ పరిశోధనలో తేలిన వివరాలను ఆసంస్ద వ్యవస్దాపకులు డా. సత్యేందర్ గోయెల్ వివరిస్తూ బీఎంఐ స్కోర్లకు ,బీపికి మధ్య గట్టి సంబంధం ఉందని పరిశోధనలో తేలిసింది. అంతేకాదు బీఎంఐ స్కోరు ఎంత ఎక్కువ ఉంటే బీపీ ముప్పు అంత ఎక్కువనీ తెలిసింది. మహిళలకంటే పురుషుల్లో బీపీ ముప్పు ఎక్కువని కూడా తెలిసింది. హైబీపి విషయం కూడా సరిగ్గా ఇలాగే ఉందని తెలిపారు. నిశ్చల జీవనశైలి, పని అలవాట్లు 26నుంచి 40 సంవత్సరాల వయస్సు గలవారిని దెబ్బతీశాయి. ఎందుకంటే ఊబకాయం, అధిక రక్తపోటు సమస్యలతో వారికి సీవిడీలు వచ్చే ప్రమాదం ఎక్కువ.
అందువల్ల గుండె జబ్బుల నుంచి తక్షణం బయటపడి గుండె ఆరోగ్యాన్ని పొందాలి. దీని నివారణ, ప్రిడిక్టివ్ కార్డియాలజీ ద్వారా మనం సాధించవచ్చు. దాని కోసం, సాంకేతిక పరిజ్ఙానం ఆదారంగా చేసే సంరక్షణ కార్యక్రమాలతో క్రమం తప్పకుండా ముందస్తు పరీక్షలు చేయించుకోవాలి. ఇది ఆరోగ్యాన్ని పొందడానికి సహాయపడుతుందన్నారు. ఐహెచ్‌ఎల్ కేర్ పరిశోధనతో ఎట్టకేలకు యువతలో ఊబకాయం, అదికపోటు మధ్య సంబంధం తెలిసింది. ఇదే చాలావరకు సీవిడీలకు ప్రధాన కారణం అవుతోంది. యువతలో ఎక్కువమందికి కార్డియాక్ అరెస్టులు ఇటీవల ఎందుకు వస్తున్నాయో దీంతో తెలుస్తోంది. భారతీయులు ముందు జాగ్రత్తలు వైద్యపరీక్షలు చేయించుకోవడం లేదు. అందుకు నివారించదగ్గ వ్యాధులు త్వరగా బయటపడటం లేదు. దీంతో పట్టణ జనాభాలో ముఖ్యంగా యువతలో వ్యాధుల భారం పెరిగిపోతోంది. అందువల్ల గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒకరూ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కిమ్స్ ఆసుపత్రి కన్సల్టెంట్ కార్డియాలజిస్టు డా. మహ్మద్‌సాదిక్ అజమ్ తెలిపారు.
గుండె ఆరోగ్యంలో ఆహార ప్రాధాన్యం గురించి ముంబైకి చెందిన ప్రీడమ్ వెల్‌నెస్ వ్యవస్థాపకురాలు డైరెక్టర్ నాజ్నిన్ హుస్సేన్ మాట్లాడుతూ ఐహెచ్‌ఎల్ కేర్ అధ్యయనం వెల్లడించిన వివరాల ప్రకారం హైబీపి ఊబకాయం అనే జంట సమస్యలతో యువతలో సీవీడిల ప్రమాదం ఎక్కువ ఉందని తెలుస్తోంది. దేశంలోని యువతకు ఇది ఒక ప్రమాద సంకేతం. ఊబకాయం, అదికపోటు అనే రెండు సమస్యలకూ ఆహారమే ప్రధాన కారణం. అందువల్ల ప్రతిఒకరు ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసేవారు. నిశ్చల జీవనశైలిని గడుపుతున్న ప్రజలు, క్రమం తప్పకుండా ముందస్తు వైద్యపరీక్షలు చేయించుకోవాలి. గుండెకు ఆరోగ్యకరంగా ఉండే ఆహార నియమాలను పాటించాలని తెలిపారు.