Thursday, January 16, 2025

జిమ్ చేసి ఇంటికి వచ్చాడు…. ఖమ్మంలో గుండెపోటుతో యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: జిమ్‌కు వెళ్లి వచ్చాక యువకుడు విశ్రాంతి తీసుకుంటుండగా గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఖమ్మం నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఖమ్మంలోని బాటపేటలో కాంగ్రెస్ నాయకుడు మానుకొండ రాధాకిశోర్ కుమారుడు శ్రీధర్ గత కొన్ని రోజులుగా జిమ్‌కు వెళ్తున్నాడు. సోమవారం జిమ్ చేసి ఇంటికి వచ్చిన తరువాత అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. మానుకొండ రాధాకిశోర్ గతంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్‌గా పని చేశారు. శ్రీధర్ మృతిపట్ల స్థానిక కాంగ్రెస్ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖమ్మంలోని అల్లిపురంలో ఆదివారం నాగరాజు(33) గుండెపోటుతో చనిపోయాడు. యువకులు గుండెపోటుతో ఎందుకు చనిపోతున్నారు అనే విషయం అంతుపట్టడంలేదు. ఎప్పుడు ఎవరు ఎలా రాలిపోతున్నారని విషయం అంతుచిక్కడు లేదు. తాజాగా గాయకుడు సాయిచందు గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే.

Also Read: నిత్య పెళ్లి కొడుకు… ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 పెళ్లిళ్లు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News