ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తోంది. చిన్న, పెద్ద తేడా లేకుండా గుండెపోటు అందరికీ వస్తోంది. గుండెపోటుకు ముందు కనిపించుకునే సాధారణ లక్షణాలు గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. వైద్యుల ప్రకారం.. ఆడవారిలో గుండె జబ్బు లక్షణాలు పురుషుల నుండి భిన్నంగా ఉండవచ్చని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం ఈ వార్త ద్వారా తెలుసుకుందాం.
లక్షణాలు
1. శరీరంలోని వివిధ భాగాలలో నొప్పి
శరీరంలోని మెడ, దవడ, భుజం, ఎగువ వీపు లేదా పొట్ట వంటి వివిధ భాగాల్లో నొప్పి వస్తే అది గుండెపోటు లక్షణం కావచ్చు.
2. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
గుండెపోటు ముందు ఆడవారు తరచుగా శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడతారు. ఒకవేళ వారు పని చేస్తుంటే ఇది అధికంగా ఉండవచ్చు.
3. చేయి నొప్పి
రెండు చేతుల్లో విపరీతమైన నొప్పి, అసౌకర్యంగా ఫీల్ అయితే అది గుండెపోటు లక్షణం ఉండవచ్చు.
4. తల తిరగడం లేదా వికారం
ఆడవారికి గుండెపోటు వచ్చే ముందు తల తిరగడం, వికారం లేదా వాంతులు అనిపించవచ్చు. శరీరంలో రక్త ప్రసరణ లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది.
5. చెమట పట్టడం
గుండెపోటు వచ్చే ముందు చెమట కూడా పట్టవచ్చు. ముఖ్యంగా రాత్రి నిద్రపోతున్నప్పుడు ఇలా అనిపించవచ్చు. దీని ప్రధాన కారణం శరీరంలో నీరు లేకపోవడం.
ఎలా నివారించాలి?
1. ప్రతిరోజు వ్యాయామం, వాకింగ్ చేయాలి.
2. తగినంత నిద్రపోవాలి. రోజుకు కనీసం 7 నుండి 8 గంటల వరకు నిద్రపోవాలి.
3. పోషకమైన, తేలికపాటి ఆహారం తీసుకోవాలి.
4. ధూమపానం, మద్యపానం అలవాటు ఉంటే మానుకోవాలి.
5. రక్తంలో షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచుకోవాలి.