Saturday, January 4, 2025

తీవ్ర విషాదం.. కారు నడుపుతుండగా గుండెపోటు

- Advertisement -
- Advertisement -

కారు నడుపుతున్న ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన విషాద సంఘటన ఓల్డ్ సిటీలో వెలుగుచూసింది. బడంగ్ పేట్ వాసి ధనుంజయ్(41) ఓ ట్రావెల్స్ డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం లాల్ దర్వాజలో కస్టమర్ ను కారులో ఎక్కించుకుని డ్రాప్ చేసేందుకు బయలుదేరాడు. నల్లవాగు సమీపంలోని ధోబీఘాట్ వద్ద కందికల్ ఆర్వోబీ ఎక్కే ముందే ధనుంజయ్ కు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. ఈ సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడిని భార్య నందినిజై, కూతురు ఝాన్సీ(10), కొడుకు సుదాన్ష్(8)ఉన్నారు. ధనుంజయ్ చనిపోయాడన్న వార్త విన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News