Wednesday, January 22, 2025

పాల ఉత్పత్తులతో గుండెకు మేలు

- Advertisement -
- Advertisement -

తక్కువ శాతం కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులను తీసుకుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చాలా మంది నమ్ముతుంటారు. కానీ పూర్తిశాతం కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులను ఆహారంతోపాటు తీసుకుంటే గుండెకు మేలు జరుగుతుందని తాజా అధ్యయనం చెబుతోంది. కెనడాకు చెందిన మెక్‌మాస్టర్ యూనివర్శిటీ పరిశోధకులు 21 దేశాలకు చెందిన 3575 ఏళ్ల వయసున్న 1,36,384 మందిని అధ్యయనం చేశారు. వీరంతా రోజూ తీసుకునే పాలతో ఆరోగ్యం ఎలా ఉందో తొమ్మిదేళ్లపాటు అధ్యయనం చేసి ఆరోగ్య వివరాలు రికార్డు చేశారు. వీరిని 4 కేటగిరిలు విభజించారు.

పాల పదార్థాలను తీసుకొనేవారు, రోజుకు ఒకటి రెండు పాల పదార్ధాలను తీసుకునేవారు, రోజుకు రెండు కన్నా ఎక్కువగా పాలపదార్ధాలను తీసుకునేవారు ఈ విధంగా నాలుగు కేటగిరీలుగా విభజించారు. వారు మొత్తం కొవ్వు కలిగిన పాల పదార్ధాలను తీసుకుంటున్నారా లేక తక్కువ కొవ్వు కలిగిన పాల పదార్థాలను తీసుకుంటున్నారా అన్నది కూడా ఈ అధ్యయనంలో ముఖ్యాంశంగా తీసుకున్నారు. అసలు పాల పదార్ధాలను తీసుకోలేనివారి కన్నా రోజుకు మూడుసార్లు పాలపదార్థాలను తీసుకున్నవారికి మరణాల ప్రభావం చాలా తక్కువగా కనిపించింది. అంతేకాదు గుండె సంబంధ వ్యాధుల చిక్కు కూడా తక్కువగానే ఉంది.

అలాగే రోజుకు సగం కొవ్వుతో పాల పదార్ధాలను తీసుకున్నవారికన్నా మొత్తం కొవ్వుతో పాల పదార్ధాలను మూడుసార్లు తీసుకున్న వారికి గుండెజబ్బు వచ్చే సూచనలు చాలా తక్కువగా ఉన్నాయని తేలింది. తక్కువ కొవ్వు కలిగిన పాల పదార్ధాలను తీసుకుంటే ప్రయోజనాలు ఉంటాయని గతంలో ఎందుకు తప్పుడు సలహా ఇచ్చారో అర్ధం కావడం లేదని పరిశోధకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొవ్వు ఎక్కువగా ఉన్న పాలను సేవిస్తే కొలెస్టరల్ పెరుగుతుందన్న అపోహ ఉందని, కానీ పాల పదార్ధాలలో చాలా ప్రయోజన కారక మూలకాలు అమినోయాసిడ్స్, విటమిన్ కె, కేల్షియం,మెగ్నీషియం, వంటివి ఉంటాయని పరిశోధకులు పేర్కొన్నారు. అవి రసాయనికంగా పులియడంతో మేలు జరుగుతుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News