Sunday, January 19, 2025

మధుమేహం నియంత్రణ లేకుంటే గుండెపోటు సమస్యలు

- Advertisement -
- Advertisement -

Heart problems if diabetes is not controlled

ఈమధ్య కాలంలో యువత ఎక్కువగా ఎదుర్కొంటున్నారు
ఊబకాయం నివారణ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
ఏమాత్రం లక్షణాలున్న వెంటనే పరీక్షల చేయించుకోవాలని వైద్యుల సూచనలు

హైదరాబాద్: ఇటీవల కాలంలో గుండెపోటు ఘటనలు చాలా ఎక్కువగా సంభవిస్తున్నాయి. యువత కూడా తరచు వీటి భారిన పడుతున్నారు. భారతీయులకు ఈ విషయంలో ఉండే ముప్పు కారణాలు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే విభిన్నంగా ఉంటాయా అన్న ప్రశ్నకు ఇప్పటికి సమాధానం కచ్చితంగా దొరకట్లేదు. ఈవిషయంలో లోతైన పరిశోధనల అవసరం ఉంది. ఇదే అంశంపై ఇండియన్ హార్ట్ జర్నల్‌లో 2022 ఆగస్టులో మెరిఫాక్స్ పేరుతో ఒక విస్తృతమైన పరిశోధన జరిగింది. ఇందులో భారతీయులకు గుండెపోటు ముప్పు కారణాల గురించి చర్చించారు. ఈపరిశోధన విషయంలో సీనియర్ కార్డియాలజిస్టు డా. హయగ్రీవరావు దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధకుల బృందానికి నేతృత్వం వహించారు. న్యూడిల్లీ నుంచి త్రివేండ్రం వరకు 15 పెద్ద టెర్షియరీ కార్డియాలజీ ఆసుపత్రులలో ఈపరిశోధన చేశారు. రెండు సంవత్సరాల పాటు 2153 మంది రోగులను పరిశీలించి, వారిని 1200 నియంత్రణ జనాభాతో పోల్చి చూశారు. వివిధ ఆర్దిక పరిస్దితులు, పట్టణాలు, పల్లెలకు సంబంధించిన విభిన్న రంగాలకు చెందిన రోగులకు తీసుకున్నారు. రోగుల సగటు వయస్సు 56 ఏళ్లు కాగా, వారిలో 76 శాతం మంది పురుషులు, గడిచిన 20 ఏళ్లలో వైద్య రంగం గణనీయంగా అభివృద్ది చెందినా, యువత ఇప్పటికి గుండెపోటుతో బాధపడుతున్నట్లు తేలిపింది.

దూమాపానం, అధికపోటు, మధుమేహం, అధిక ఎల్‌డిఎల్ కొలెస్టరాల్ వంటివి గుండెపోటుకు ప్రధాన కారణాలన్న విషయం అందరికి తెలిసిందే. ఇతర కారణాలు కూడా కొన్ని ముఖ్యమైనవే ఉన్నా. అవి అంత ప్రాధాన్యమైనవికావు. అవి అధిక బరువు, మధుమేహ నియంత్రణ సరిగా లేకపోవడం, నిశ్చల జీవనశైలి, హెచ్‌డిఎల్, గుండెపోటుతో బాధపడుతున్న 95శాతం మంది రోగులకు వీటిలో ఏవో ఒకటి ఉన్నాయి. ఈముప్పు కారణాలను నియంత్రించడ సంప్రదాయ ముప్పు కారణాల నియంత్రణలాగే చాలా ముఖ్యమైనవి ఈపరిశోధన తేలిందన్నారు. మూడింట ఒక వంతు మంది రోగులకు హెచ్‌బిఏ1సీ665 మధ్య ఉంటోంది. అంటే వారు మధుమేహానికి ముందు స్దాయిలో ఉన్నట్లు. అంటే మధుమేహానికి చికిత్స ప్రారంభించడానికి ముందే గుండెపోటు నివారణకు చర్యలు ప్రారంభించాలి. దేశంలో గుండెపోటు నివారించడానికి , ఊబకాయాన్ని నివారించడం, మధుమేహాన్ని కఠినంగా నియంత్రించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు.

స్థూలకాయం, నిశ్చల జీవనశైలి, మధుమేహానికి సరైన చికిత్స చేయకపోవడం. ఇవన్నీ భారతదేశంలో గుండెపోటు నివారణ చికిత్సలో ముఖ్యమైన లోపాలు. వీటిని సమగ్రంగా పరిష్కరిస్తే తప్ప… వైద్యులు పాటించే రిస్క్ ఫ్యాక్టర్ మోడిఫికేషన్ పూర్తికాదు. వ్యక్తిగత స్దాయిలో, అధిక బరువును నివారించడానికి ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ప్రతి ఏటా లిపిడ్ ప్రొపైల్, హెచ్‌బిఏ1సి పరీక్షలు చేయించుకుని మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. మధుమేహం ఉన్నవారు హెచ్‌బీఏ1సీ 7లోపు ఉండేలా చూసుకోవాలి. యువ జనాభాలో గుండెపోటు వస్తోంది. నివారణ చర్యలను 20 సంవత్సరాల వయస్సు రావడానికి ముందే ప్రారంభించాలి. మధుమేహాన్ని గుర్తించడానికి విస్తృతంగా పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. కేవలం బ్లడ్‌షుగర్ ఒక్కదానే కాకుండా వీలైనంత ఎక్కువ మందికి హెచ్‌బిఏ కూడా పరీక్షించి, అది 7లోపు ఉండేలా అవగాహన కల్పించి, నియంత్రణ చర్యలు చేపట్టాలి. తగిన ప్రచారాలు చేయడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాల్సిన ప్రాధాన్యం, రోజువారీ వ్యాయామాలు చేయడం ద్వారా ఊబకాయాన్ని నివారించి, మంచి కొలెస్టరాల్ పెంచుకునేలా చూడాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News