హైదరాబాద్ : హైదరాబాద్‌కు చెందిన ఆడియాలజీ చైన్ హియర్‌జాప్ తమ 100వ స్టోర్‌ను ప్రారంభించింది. జూబ్లీహిల్స్‌లో ప్రారంభించిన హియర్‌జాప్ ఈ స్టోర్‌ని సిమెన్స్ హియరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇన్క్ మాజీ సిఇఒ ఎస్‌కె శర్మ, హెర్‌జాప్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ రాజా ఎస్‌తో కలిసి ప్రారంభించారు. ఆర్థిక సంవత్సరం 2026 నాటికి 250 స్టోర్‌లను, భవిష్యత్తులో 500 స్టోర్స్‌ను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని బ్రాండ్ లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా వినికిడి ఆరోగ్య సంరక్షణను అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది.
హియర్‌జాప్ ఎండి రాజా ఎస్ మాట్లాడుతూ, దేశంలో వినికిడి సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే నిబద్ధతకు నిదర్శనంగా 100వ స్టోర్ ప్రారంభోత్సవం నిలుస్తుందని అన్నారు. ప్రతి స్టోర్ అసెస్‌మెంట్‌ల నుండి నెక్ట్-జెన్ హియరింగ్ ఎయిడ్స్ వరకు, ఆడియోలజిస్ట్‌లతో కన్సల్టేషన్ల వరకు సేవలను అందిస్తుంది. దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాలు, ఆగ్నేయంలో ఛత్తీస్‌గఢ్, నైరుతిలో మహారాష్ట్ర, తూర్పున పశ్చిమ బెంగాల్‌తో సహా ఎనిమిది రాష్ట్రాల్లోని 100 స్టోర్‌లలో 150 మంది ఆడియోలజిస్ట్‌ల బృందంతో, హియర్‌జాప్ ఖాతాదారుల నిర్ధారిస్తుంది.