Monday, December 23, 2024

అక్కపై మరిగే నూనె పోసిన చెల్లి….

- Advertisement -
- Advertisement -

Heat Oil pour on Sister in kamareddy

కామారెడ్డి: తనతో చనువుగా ఉన్న వ్యక్తితో అక్క మాట్లాడుతుందని నిద్రిస్తున్న ఆమెపై చెల్లి మరిగే నూనె పోయడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన కామారెడ్డి జిల్లా అశోక్‌నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. చాందినీ, నాగూర్‌బీ అనే అక్కాచెల్లెళ్లు భర్తలు వదిలేయడంతో కాలనీలో వేరు వేరుగా నివాసం ఉంటున్నారు. స్థానికంగా ఉంటే శ్రీను ఇద్దరికి పరిచయం ఉంది. శ్రీనుతో అక్క చనువుగా ఉండడంతో ఆమెపై చెల్లి పగ పెంచుకుంది. నిదిస్తున్న నాగూర్‌బీపై చాందినీ నూనె పోసింది. ఈ ఘటనలో అక్క తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News