Sunday, January 19, 2025

వడ దెబ్బ మరణాలపై షిండే ప్రభుత్వంపై ప్రతిపక్షం దాడి!

- Advertisement -
- Advertisement -

ముంబై: మహారాష్ట్రలో వడదెబ్బకు 11 మంది మరణించారు. 600కు పైగా మంది ఆసుపత్రిపాలయ్యారు. దీనిపై ఏక్‌నాథ్ షిండే- దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షమైన మహా వికాస్ అఘడి(ఎంబిఎ) నిలదీసింది. ఎండలు మండుతున్న కాలంలో మధ్యాహ్నం వేళ ‘మహారాష్ట్ర భూషణ్ అవార్డుల వేడుక’ నిర్వహించాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించింది.

మహారాష్ట్ర భూషణ్ అవార్డును ఆదివారం నవీ ముంబైలోని శాటిలైట్ టౌన్‌సిప్‌లోని ఖార్ఘర్‌లోని కార్పొరేట్ పార్క్‌లో సుప్రసిద్ధ సామాజిక కార్యకర్త, అప్పా సాహెబ్ ధర్మాధికారిగా ప్రసిద్ధి చెందిన దత్తాత్రేయ నారాయణ్ ధర్మాధికారికి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు.

నవీ ముంబైలోని ఎంజిఎం ఆసుపత్రిని సందర్శించిన తర్వాత ఏక్‌నాథ్ షిండే మరణించిన వారి బంధువులకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఆసుపత్రుల్లో చేరిన వారికి ఉచిత వైద్య చికిత్సను ప్రకటించారు. అస్వస్థతకు గురైన వారికి పిఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 2,50,000 ఎక్స్‌గ్రేషియాను అందజేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. శివసేన(యుబిటి) అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తప్పెక్కడ జరిగింది తెలియాలన్నారు. ‘ఇది పూర్తిగా నిర్లక్షంగా కారణంగా జరిగిందే’ అని ప్రతిపక్ష నాయకుడు అజిత్ పవార్ అన్నారు. ‘ముఖ్యమంత్రి షిండే రాజీనామా చేయాలి’ అని ఆప్ జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలు ప్రీతి శర్మ డిమాండ్ చేశారు. ‘వారు అవార్డు ప్రధానోత్సవాన్ని రాజకీయ ర్యాలీ చేసేశారు’ అని ఆమె పాయింటవుట్ చేశారు. ప్రజలను ఎండలో కూర్చొబెట్టి ట్రాజెడికి గురిచేయడాన్ని శివసేన(యుబిటి) రాజ్యసభ సభ్యులు ప్రియాంక చతుర్వేది నిందించారు.

Shinde and Fadnavis

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News