Friday, November 22, 2024

వడగాల్పుల తీవ్రతపై కేంద్రం అప్రమత్తం.. రాష్ట్రాలకు బృందాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వడగాలుల తీవ్రతపై కేంద్రం అప్రమత్తమయ్యింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాలకు బృందాలను పంపాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా వేడి తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మనస్సుఖ్ మాండవీయ నేతృత్వంలో జరిగిన కీలక భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రానున్న రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, హరియాణా, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ చర్యలు మొదలు పెట్టింది.

వేడి తీవ్రతను గుర్తించి..
దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించినా ఇంకా అనేక రాష్ట్రాల్లో ఎండ తీవ్రత కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు రాష్ట్రాల్లో ఉన్న వేడి తీవ్రతను గుర్తించి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మనస్సుఖ్ మాండవీయ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో భారత వాతావరణ విభాగం (ఐఎండి) సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వడగాల్పుల తీవ్రత ఉన్న రాష్ట్రాల్లో పర్యటించేందుకు కేంద్రం, ఐఎండీకి చెందిన ఐదుగురు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలకు చెందిన ఆరోగ్యశాఖ మంత్రులతో త్వరలోనే వర్చువల్ భేటీ నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News