Thursday, January 23, 2025

రాష్ట్రంలో దంచికొడుతున్న ఎండలు

- Advertisement -
- Advertisement -
రోజుకు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
రాగల రెండు రోజుల్లో వడగాల్పులు వీచే అవకాశం
పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసిన వాతావరణ శాఖ

హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. జూన్ చివరలో కూడా ఇలా ఎండల ప్రభావం ఎక్కువగా ఉండటంతో జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్, వరంగల్, నల్లగొండ, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో నిప్పుల కొలిమి రాజుకుంటోంది. రోజుకు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు ఉమ్మడి జిల్లాలోని సింగరేణి ప్రాంతంలోని కార్మికలు ఎండలకు ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రం ఆరుగంటల వరకు కూడా ఎండ తీవ్ర ప్రతాపం చూపుతోంది.

రాబోయే మూడురోజుల పాటు ఉరుములు, మెరుపులు
మరో వైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాగల రెండు రోజుల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రజలను అప్రమత్తం చేసింది. ఆదిలాబాద్, కుమురభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ వడగాలులు వీచే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ మేరకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. అదే సమయంలో రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు మరికొన్ని ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News