Wednesday, January 22, 2025

ఏప్రిల్ నుంచి జూన్ వరకు హీట్‌వేవ్ ఎక్కువే : ఐఎండి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వాయువ్యం, ద్వీప ప్రాంతాలు మినహా ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశ వ్యాప్తంగా సగటు సాధారణం కన్నా ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్టు శనివారం భారతీయ వాతావరణ శాఖ ( ఐఎండి)పేర్కొంది. సాధారణం కన్నా ఎక్కువ స్థాయిలో హీట్‌వేవ్ ఉంటుందని హెచ్చరించింది. సెంట్రల్, తూర్పు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. బీహార్, జార్ఖండ్ ,యూపీ, ఒడిశా, బెంగాల్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానా, రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం అధికంగా ఉంటుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. ఏప్రిల్‌లో దేశ వ్యాప్తంగా వర్షాలు, సాధారణ స్థాయిలో ఉంటాయన్నారు. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ స్థాయిలో వర్షాలు కురుస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News