Sunday, December 22, 2024

భారీగా పట్టుబడుతున్న నగదు..మద్యం.. మత్తు పదార్థాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నగదు, మధ్యం, మత్తు పదార్థాలు భారీగా పట్టుబడుతున్నాయి. అక్టోబర్ నుండి ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న నగదు మొత్తం రు.173 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నవంబర్‌లో గత ఐదు రోజులుగానే 2 కోట్ల 53 లక్షల 10 వేల నగదు స్వాధీనం అయింది. ఇక మద్యం కూడా ఇదే స్థాయిలో పట్టుబడుతోంది.

గత అక్టోబర్ నెల నుండి ఇప్పటి వరకు రూ. 60 లక్షల మద్యం పట్టుబడింది. గత ఐదు రోజులుగానే రూ. 4 లక్షల 32 వేల విలువ చేసే మద్యం (మద్యం 111957.28లీ, 44379కేజీల నల్ల బెల్లం, 2553 కేజీల ఆలం) పట్టుబడింది. ఇలా పట్టుబడిన మొత్తం మత్తు పదార్థాలు (గంజాయి 95.60కిలోలఎన్ డీ పీ ఎస్ ) కలిపి రు 28 లక్షల 61 వేల విలువ చేసే మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. కాగా ఇక బంగారం వెండి, వాటితో చేసిన ఆభరణాలు, వస్తువులు కూడా పట్టుబడుతున్నాయి. ఈ నవంబర్‌లో ఐదు రోజులుగా చేసిన దాడుల్లో రూ. 75 లక్షల 10 వేల విలువ చేసే బంగారు ఆభరణాలు పట్టుబడగా క్రితం నెల అక్టోబర్ నుండి రూ. ఒక కోటి 76 లక్షల 5 వేల విలువ చేసే బంగారు, వెండి వాటితో చేసిన ఆభరణాలు పట్టుబడ్డాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News