Wednesday, January 22, 2025

ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీపై పెనుభారం: బిఎస్పీ నేత ఆర్‌ఎస్. ప్రవీణ్‌ కుమార్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్టంలో ఈ మధ్య కాలంలో లాభాల బాట పడుతున్న ఆర్టీసీ మీద మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలు పెను భారం పడుతుందని బిఎస్పీ చీఫ్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ట్విట్టర్ వేదికగా ఉచిత బస్సు ప్రయాణం దాదాపుగా 50 వేల మంది ఆర్టీసీ కార్మికుల జీవితాల మీద కూడా ప్రభావం చూపబోతున్నదని తెలిపారు.

గ్రామాలకు ఆర్టీసీ బస్సులు తెలంగాణ వచ్చినప్పటినుండి రకరకాల కారణాలతో నడపలేదని కొత్త ప్రభుత్వం మళ్లీ ఆ సర్వీసులను పునరుద్ధరిస్తారా? అన్నది కూడా ప్రశ్నార్థకంగా మిగిలిందన్నారు. అదే విధంగా లక్షలాది మంది ఆటో డ్రైవర్లు తమకు తగినంత ప్యాసింజర్లు దొరక్క రోడ్ల మీద పడతామేమోనని ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో తగిన ఉపాధి లభించక నగరాలకు వలస వచ్చి ఇరుకు గదుల్లో నివాసముంటూ కిరాయి ఆటోలను నడుపుతూ పొట్టగడుపుకుంటున్న ఆటో డ్రైవరు సోదరులను ప్రభుత్వమే ఆదుకోవాలని ట్వీట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News