Monday, December 23, 2024

పెరిగిన చలి తీవ్రత

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణలో చలి రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నది. బుధవారం మరింత పెరిగింది. మరో వైపు రాబోయే రెండు మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆ తర్వాత తగ్గుతుందని పేర్కొంది. మళ్లీ నెలాఖరున పెరుగుతుందని, చలికి తోడు చలిగాలులు వీస్తాయని అంచనా వేసింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతాయని.. సాధారణం కంటే డిగ్రీ కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 12నుంచి -13 డిగ్రీల మధ్య నమోదవుతాయని తెలిపింది.

రాజేంద్రనగర్‌లో12.5, మెదక్‌లో 12.8 డిగ్రీల అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 28-నుంచి 31 డిగ్రీలుగా నమోదవుతుండగా, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాజేంద్రనగర్‌లో 12.5 డిగ్రీలు, మెదక్ 12.8, పటాన్‌చెరులో 13.2, ఆదిలాబాద్‌లో 13.7, హకీంపేటలో 14.5, హనుమకొండలో 15, దుండిగల్‌లో 15.7, రామగుండంలో 14.6, నిజామాబాద్‌లో 16.1, హైదరాబాద్‌లో 16.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. ఖమ్మంలో 17, మహబూబ్‌నగర్‌లో 18.5, భద్రాచలంలో 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News