పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. పెరిగిన చలిగాలులు
మన తెలంగాణ/సిటీబ్యూరో: గతకొద్ది రోజులుగా వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకోవడంతో గ్రేటర్ హైదరాబాద్ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళలు అత్యంత కనిష్ట స్థాయి పడిపోవడంతో జనాలు బయటకు రావాలంటే జంకుతున్నారు. తమ దైనందిత కార్యక్రమాలను పూ ర్తిగా మార్చివేసుకుంటున్నారు. సాధారణంగా ఉదయం 6గంటల సమయంలో పార్క్‌లు, గార్డెన్‌లు మార్నింగ్‌వాక్ వచ్చేవారితో నిండిపోవడంతో వారు రోడ్లను వా కింగ్ మార్గాలుగా వినియోగించేవారు. ప్రస్తుతం ఉదయం 7గంటలు దాటినా లేచేందుకు సిద్ధ్దపడటం లే దు.
దాంతో ఉదయం సమయంలో రోజు వాకింగ్ వచ్చేవారితే కళకళ లాడే ,గార్డెన్‌లు, ఖాళీ ప్రదేశాలు వాకర్స్ లేక బోసిపోతున్నాయి.సాయంత్రం 10 గంటలు దా టినా ఇంటికి చేరుకొని వారు 8 గంటలకు కల్లా ఇంటికి చేరుకుంటున్నారు. ఫ్యాన్లు, ఏసీలు లేనిదే రోజు గడవదనుకునేవారు సైతం వాటికి దూరంగా ఉంటున్నారు. చలి పెరుగుతుండటంతో ఆహార నియమాలను సైతం పూ ర్తిగా మార్చుకుంటున్నారు. అస్తమా వంటి వ్యాధులు ఉన్నవారు వాకింగ్‌లకు పూర్తిగా దూరమవుతున్నారు. అర్దరాత్రులు విధులు నిర్వహించే వారు చలి అధికంగా ఉండటంతో డ్యూటీలను మార్చుకునేందుకు ఇష్టపడుతున్నారు. ప్రతి సంతవ్సరం డిసెంబర్ ,జనవరి నెలలో ఉష్ణోగ్రతలు పడిపోవడం సాధారణమే కాని ఇంత తక్కువ మొత్తంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం గతంలో కూడా ఎప్పుడూ లేదని దీనికి ప్రధాన కారణం ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో అల్పపీడం ఏర్పడి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడే కారణంగా చెబుతున్నారు. ఇదే పరిస్థితి మరి కొద్ది రోజులు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
గత వారం రోజులుగా నగరంలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు
వారం అత్యధికం(డిగ్రీలలో) అత్యల్పం(డిగ్రీలలో)
శుక్రవారం 24 17
గురువారం 30 21
బుధవారం 31 18
మంగళవారం 33 17
సోమవారం 33 18
ఆదివారం 32 18
శనివారం 20 10