Wednesday, January 22, 2025

ముమ్మరంగా పంటనష్టం అంచనా…

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ జనగామ : జనగామ మండల వ్యాప్తంగా అకాల వర్షాలకు భారీగా పంటనష్టం జరిగింది. కాగా అధికారులు ముమ్మరంగా పంట నష్టం అంచనా వేస్తున్నారు. బుధవారం పెద్దరామన్‌చర్లలో వ్యవసాయ విస్తరణ అధికారి మల్లేష్ పర్యటించి పంటనష్టంపై వివరాలు సేకరించారు. పంట నష్టంపై అంచనా వేసి ఒక జాబితాను తయారుచేసి పైఅధికారులకు ఆ లిస్టును పంపిస్తున్నామని పేర్కొన్నారు.

Also Read: విమానంలో హస్తప్రయోగం…. ర్యాపర్ అరెస్టు

నష్టపోయిన రైతుల యొక్క పాస్‌బుక్, ఆధార్‌కార్డు, జిరాక్స్‌లను తీసుకొని సమాచారాన్ని సేకరిస్తున్నారు. రైతులకు తగిన నష్టపరిహారం అందేవిధంగా చూస్తామని సర్వే అధికారులు తెలుపుతున్నారు. సర్వే సందర్భంగా నష్టపోయిన రైతులు తమ గోడును అధికారులకు విన్నవించుకుంటున్నారు. రైతులు రాంరెడ్డి, సంతోష్‌రెడ్డి, నర్సింహారెడ్డి, రాజు, వీరారెడ్డి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News