Sunday, December 22, 2024

అకాల వర్షాలతో అపార నష్టం

- Advertisement -
- Advertisement -

చింతకాని : మండల పరిధిలో భారీ గాలి దుమారంతో కురిసిన వర్షాల వలన అపార నష్టం వాటిల్లింది. ఆదివారం సాయంత్రం కురిసిన ఈ వర్షాలతో కొదుమూరు సమీపంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద గల కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల పురాతన చింత చెట్టు ఈ గాలి దుమారానికి కూలి పోయింది. ఈ ఘటనలో దేవాలయం ఎదురుగా నిర్మించిన ఫంక్షన్ హాలు పై చింత చెట్టు విరిగిపడి రేకులన్నీ ఎగిరిపోయాయి. గాలి వాన మొదలవడంతో ఆ శివాలయం దగ్గరలో ఉన్న చెట్టు కింద స్విఫ్ట్ డిజైర్ కారు రెండు వాహనాలు పెట్టి రేకుల షెడ్డు కిందకి వెళ్లారు.

అదే సమయంలో చెట్టు విరుగిపడి కారు, రెండు ద్విచక్రవాహనాలు నుజ్జు నుజ్జయ్యాయి. దీంతో అపార నష్టం వాటిల్లింది. స్విఫ్ట్ డిజైర్ కారు ఖమ్మం పట్టణానికి చెందిన షేక్ అమీదా బేగం అనే మహిళది కాగా, రెండు ద్వీచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసమైయ్యాయి. అంతేకాకుండా మండలంలో మొక్కజొన్న సాగు చేసి కల్లాల్లో బస్తాలు కాటా వేయకుండా ఉన్న బస్తాలు తడిసిపోయాయి. దీంతో మొక్కజొన్న రైతులకు లక్షల్లో నష్టం వాటిల్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News