Monday, December 23, 2024

నీట మునిగిన పంప్ హౌస్.. భారీగా నష్టం

- Advertisement -
- Advertisement -

చిన్నకోడూరు: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారం వద్ద హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేసే పంప్ హౌస్‌లో సాంకేతిక లోపం వల్ల ఆదివారం రాత్రి పంపులు నీట ముగిసాయి. విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గుల కారణంగా వాటర్ ప్రేషర్‌ను అదుపు చేయకపోవడంతో పెద్ద ఎత్తున నీరు పంప్ హౌస్‌లోకి వచ్చి పంపులు నీట మునిగినట్లు తెలిసింది. హెచ్‌ఎండబ్లూఎస్ వాటర్ పథకంలో భాగంగా మల్లారం వద్ద వాటర్ ఫిల్టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. తొమ్మిది మోటార్లు ఏర్పాటు చేయగా ఆరు మోటార్లు నిరంతరం పంపింగ్ చేస్తాయి. విద్యుత్ సాంకేతిక కారణాల వల్ల మోటార్‌లు పంప్ హౌజ్‌లో నీట మునిగాయి.

Also Read: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టుల మృతి

విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు మల్లారం వాటర్ ప్లాంట్‌కు చేరుకొని పంప్ హౌస్‌లోని నీటిని తోడేశారు. మరమ్మతుల నిమిత్త మోటర్‌లను హైదరాబాద్‌కు తరలించారు. ఈ స్థానంలో కరీంనగర్ జిల్లా బొమ్మకల్ వాటర్ ప్లాంట్‌లోని మూడు మోటర్‌లను తీసుకువచ్చి తాత్కాలికంగా అమర్చారు. మోటార్‌లు యథావిధిగా కొనసాగుతున్నట్లు సమాచారం కాగా రెండే ఏళ్ల క్రితం భారీ వర్షాల కారణంగా వరదనీరు పంప్ హౌస్‌లోకి చేరడంతో పెద్దఎత్తున నష్టం జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుత సాంకేతిక కారణాలతో నీటి మునిగిన పంప్‌లతో భారీగా నష్టం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News