- Advertisement -
బాసర : నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో గురువారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు చిన్నారులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి నది తీరాన గల శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
భక్తులు చిన్నారులు అమ్మవారి దర్శన అక్షరాభ్యాస పూజలకు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తులు తమ చిన్నారులకు ఆలయ సన్నిధిలోని అక్షరాభ్యాస మండపంలో అక్షరాభ్యాస పూజలను ఆలయ అర్చకులచే జరిపించారు. భక్తులు చిన్నారులు ఆలయంలోని అమ్మవార్లకు దర్శించుకొని మొక్కులు చెల్లించకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
- Advertisement -