Saturday, January 11, 2025

బాసర అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

బాసర : నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. పౌర్ణమి శుభ ముహుర్తం ఉండడం, ఆదివారం సెలవు దినం కావడంతో ఉదయం నుండే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. బాసర పుణ్యక్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు చిన్నారులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి నది తీరాన గల శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు తమ చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు జరిపించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులకు అన్ని ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News