హైదరాబాద్: నగరంలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టైంది. దోమలగూడ కేంద్రంగా ఇంటర్ నెట్ ఫార్మసీ పేరుతో డ్రగ్ రాకెట్ నడుపుతున్న కింగ్ పిన్ ఆశిష్ జైన్ ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇంటర్ నెట్ ఫార్మసీ ద్వారా అమెరికాకు ఫార్మా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. అమెరికా, ఇతర దేశాలకు సైకోట్రోపిక్ ఔషధాలను సరఫరా చేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. జెఆర్ ఇన్ఫినిటీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆశిష్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని తెలిపారు. రేండేళ్లలో అమెరికాకు వెయ్యిసార్లకు పైగా ఫార్మా డ్రగ్స్ సరఫరా చేసినట్టు విచారణలో తేలిందన్నారు. నిందితుడు ఆశిష్ ఇంట్లో ఈ నెల 5న ఎన్సీబీ అధికారులు సోదాలు జరిపారు.ల్యాప్ టాప్ లు, సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి విదేశాలకు భారీగా డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. క్రెడిట్ కార్డు, బిట్ కాయిన్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు
- Advertisement -
- Advertisement -
- Advertisement -