Sunday, December 22, 2024

సంజు శాంసన్ కు భారీ జరిమానా

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ పై బీసీసీఐ షాకిచ్చింది. ఐపీఎల్ లో భాగంగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో సంజూ ఔటైన తీరు వివాదాస్పదమైంది.

తనను ఔట్ గా ప్రకటించడంతో అంపైర్ పై సంజూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వాదనలకు దిగారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన శాంసన్ కు మ్యాచ్ ఫీజ్ లో 30 శాతం జరిమానా విధించారు. ఈ సీజన్ లో శాంసన్ ఇప్పటికే స్లో ఓవరేట్ కారణంగా బీసీసీఐ 12 లక్షలు జరిమానా ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News