Tuesday, April 22, 2025

హైటెక్ సిటీలో కారులో మంటలు

- Advertisement -
- Advertisement -

Heavy fire in Car at Hitech city

 

హైదరాబాద్: ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగిన సంఘటన హైదరాబాద్ లోని హైటెక్ సిటీ సమీపంలో జరిగింది. ఒక్కసారిగా కారులో నుంచి మంటలు రావడంతో అందులో ప్రయాణికులు వాహనాన్ని నడి రోడ్డుపై ఆపి కిందకు దిగిపోయారు. క్షణాల్లో కారు మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో హైటెక్ సిటీ రోడ్డులో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు. కారు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారులో సాంకేతిక లోపంతోనే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News