Monday, January 20, 2025

ఎల్బీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. 20కి పైగా కార్లు దగ్ధం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం ఎల్బీనగర్‌లోని ఓ టింబర్ డిపోలో మంటలు చెలరేగాయి. అయితే దాని పక్కనే మల్టీప్లెక్స్, అపార్ట్‌మెంట్లు, పాత కార్ల షోరూమ్ వున్నాయి. చూస్తుండగానే టింబర్ డిపో పక్కనే వున్న పాత కార్ల షోరూమ్‌కి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 20కి పైగా కార్లు దగ్ధమయ్యాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పింది. మంటలు ఆర్పుతున్న సమయంలో కార్ల గ్యారేజీలో సిలిండర్ పేలింది. దీంతో భారీ శబ్దాలతో మంటలు ఎగిసిపడ్డాయి. పరిసర ప్రాంతాల్లో పొగ దట్టంగా అలుముకుంది. దట్టమైన పొగతో స్ధానికులు ఉక్కిరిబిక్కిరయ్యాయి. మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా చుట్టు పక్కల వారిని ఖాళీ చేయించారు. కరెంట్ సరఫరాను నిలిపి వేశారు. ఘటనా స్థలంలో నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టమేమీ సంభవించలేదని, భారీగా ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తోంది. అయితే షార్ట్ కరెంటు షార్ట్ సర్కూట్ వల్లనే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని ఫైర్ అధికారులు అంచనాకు వచ్చినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News