Monday, December 23, 2024

షార్ట్ సర్కూట్‌తో ట్రాన్స్‌ఫారంలో భారీ మంటలు

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపే ట పట్టణంలోని 19 వ వార్డు పరిధిలోని డిపో సమీపంలో పార్కింగ్ ప్రాంగణంలో ఉన్న ట్రాన్స్‌ఫారం నుంచి శు క్రవారం సాయంత్రం భారీ ఎత్తున ఈదురు గాలులకు ట్రాన్స్‌ఫారంలో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న కాలనీ వాసులు వైస్ చైర్‌పర్సన్ శైలజ విష్ణువర్ధన్ రెడ్డికి సమాచారం అందజేయగా వైస్ చైర్‌పర్సన్ చరవాణి ద్వారా ఫైర్ సిబ్బందికి తెలపడంతో సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేయడం ద్వారా పెను ప్రమాదం తప్పింది.

తద్వారా కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. కాలనీ వాసులు వైస్ చైర్‌పర్సన్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. విద్యుత్ ఏఈ ఆంజనేయులుకు చరవాణి ద్వారా ట్రాన్స్‌ఫారం పనులు త్వరితగతిన పూర్తి చేసి విద్యుత్ సరఫరా అందజేయాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని వైస్ చైర్‌పర్సన్ ఏఈని కోరారు. ఈ ఘటనలో ఫైర్ సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News