Monday, December 23, 2024

‘డేంజర్’ లెవల్

- Advertisement -
- Advertisement -

ప్రమాదం అంచున కడెం ప్రాజెక్టు.. భద్రాద్రి వద్ద గోదావరి ఉగ్రరూపం

కడెం ప్రాజెక్టుకు భారీ వరద
యుద్ధప్రతిపాదికన 25 గ్రామాల
ప్రజలు పునరావాసానికి
సాయంత్రానికి తగ్గినట్టే తగ్గి మళ్లీ
పెరిగిన వరద రాత్రి 10గం.కు
5లక్షల క్యూసెక్కులకు చేరిక
అధికార యంత్రాంగం ఉరుకులు,
పరుగులు నీటి ప్రవాహం
పెరగడంతో ఎడమ కాలువకు గండ్లు
భద్రాద్రిలో మూడో ప్రమాద
హెచ్చరికను దాటిన గోదావరి
55.60 అడుగులకు
ఎగువ నుంచి భారీ వరద
సహాయక చర్యలకు హెలీకాఫ్టర్లు
సిద్ధం దేవాదులను ముంచెత్తిన
వరద పనులకు ఆటంకం
ఎస్సారెస్పీకి వరద ఉధృతి
జూరాలకు పోటెత్తిన కృష్ణమ్మ

మన తెలంగాణ/హైదరాబాద్ : వరద గోదావరితో రాష్ట్రం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆరు రోజులుగా ఎడతెరిపి లేకుం డా కురుస్తున్న వానలకు గోదావరి, ప్రాణహిత ఉభయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రమాద స్థాయిని మించి గోదావరి దాని ఉప నదులు వరదలతో ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాలు వరద నీ టితో అల్లాడుతున్నాయి. అప్పుడే వర్షం వ స్తుందో.. ఎప్పుడు ఆగుతుందో తెలియక జ నం విలవిల్లాడుతున్నారు. ఎప్పుడు ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందోనన్న భ యంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. నదు లు పొంగి పొర్లడంతో జనజీవనం అస్థవ్యస్థమైంది. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతా లు, నదీ పరివాహక ప్రాంతాల జనం భ యం గుప్పిట్లో జీవనం సాగిస్తున్నారు. ఉత్త ర తెలంగాణలోని మొత్తం పదకొండు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

ఆదిలాబాద్, ఖమ్మం, అసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, అసిఫాబాద్ తదితర జిల్లాల్లో పట్టణాల్లో సైతం వరద ఉధృతి పరవళ్లు తొక్కుతోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో చాలా చోట్ల పుష్కర ఘాట్ల పైనుంచి గోదావరి నీరు ప్రవహిస్తోంది. భద్రాచలంలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. ఉత్తర తెలంగాణకు మళ్లీ భారీ వర్ష సూచనలతో అధికారులు, ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో పల్లపు ప్రాంతాల్లోని జనాలను అధికార యంత్రాంగం పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇంచుమించు అన్ని జిల్లాల్లోని సుమారు 5లక్షల మందిని రెవెన్యూ యంత్రాంగం షెల్టర్లకు తరలించారు. ఏ క్షణంలో ఎటువంటి పెనుముప్పు విరుచుకుపడుతుందోనని జనం వణికిపోతున్నారు. మరోవైపు గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు భద్రాచలం వద్ద కూడా గోదావరి ఉధృతి కొనసాగుతోంది.

వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు. కాగా, ఏ క్షణం పరిస్థితి ఎలా మారుతుందోనన్న బెంగ అధికారులు వెంటాడుతోంది. ఎగువ నుంచి నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతానికి చెందిన 12గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద మరింత పెరిగితే పరిస్థితి ఎంటన్నదానిపై అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎమ్మెల్యే రేఖా నాయక్, కలెక్టర్, ఎస్పీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షించారు.

మంచిర్యాలను ముంచెత్తిన వరద నీరు
పెద్ద వాగులో రెస్క్యూ టీం సభ్యుల గల్లంతు

జిల్లా కేంద్రం మంచిర్యాలను వరద ముంచేత్తింది. రాళ్లవాగు ఉప్పొంగడంతో పలు కాలనీల్లోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. దీంతో వేలాది మందిని పనరావాస కేంద్రాలకు తరళించారు. జిల్లా కేంద్రంలోని ముంపు ప్రాంతాలను ప్రభుత్వ వీప్ బాల్క సుమన్, కలెక్టర్ భారతి హోలికేలి, ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహజన్ అధికారులు పర్యటించారు. ఇదిలా ఉండగా. దహెగాం మండలం పెసరకుంట గ్రామం జలదిగ్బందంలో చిక్కుకోగా గ్రామస్తులకు పెసరకుంట పాఠశాలలో పునరావాసం కల్పించారు. సహాయక చర్యల కోసం సింగరేణి రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో బాలింతను కాపాడడం కోసం వెళ్లిన రెస్య్కూ టీం సభ్యులు మందమర్రికి చెందిన రాములు, సతీష్‌లు గల్లంతయ్యారు.

తప్పిన పెను ప్రమాదం

భారీ వర్షాలతో జనం గడగడలాడిపోతున్నారు. కుంటాల మండలం మెదన్ పూర్ గ్రామం నుంచి మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వలసకూలీలు పని పూర్తి చేసుకొని వెళుతుండగా ఓలా సమీపంలో వాగు దాటుతుండగా వాని వాహనం అదుపుతప్పి నీళ్లలోకి వెళ్లడంతో గమనించిన స్థానికులు జెసిబి సాయంతో 11 మందిని సురక్షితంగా రక్షించారు.

నిర్మల్ పట్టణ రోడ్లపైకి చేపలు

కాగా, నిర్మల్ సమీప గ్రామంలోని చెరువులు, కుంటలు తెగిపోవడంతో వరద నీరు పట్టణంలోకి ప్రవేశించింది. దీంతోపాటు చెరువుల్లోని వందల సంఖ్యలో చేపలు రోడ్లపైకి రావడంతో స్థానిక యువకులు వాటిని పట్టుకుని విందు చేసుకున్నారు. వరద నీటితో చేపలు రోడ్లపైకి రావడంతో యువత వాటిని పట్టుకుని సంబురాల్లో మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News