Wednesday, January 22, 2025

మూసీ నదికి పోటెత్తిన వరద..

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నదికి వరద నీరు పోటెత్తుతుంది. బుధవారం మూసీ ప్రాజెక్టులోకి 3,680.20వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. దీంతో కేతేపల్లి వద్ద అధికారులు మూసీ ప్రాజెక్టు ఐదు గేట్లను ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడుదల చేశారు.

మూసీ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 643.40 అడుగులు ఉంది. ఇక, మూసీ ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 4.46 టిఎంసిలు కాగా, ప్రస్తుత నీటినిల్వ సామర్థ్యం 4.04 టిఎంసిలుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News