- Advertisement -
హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదల ప్రవాహంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. జంట జలాశయాలు, హుస్సేన్‌సాగర్‌కు వరద పోటెత్తుతోంది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, హుస్సేన్‌సాగర్ నుంచి భారీగా వరద నీరు మూసీలోకి ప్రవేశిస్తోంది. మూసీ నదిలోకి 21 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. మూసారంబాగ్, చాదర్‌ఘాట్, పురానాపూల్ వంతెనలపై రాకపోకలను నిలిపివేశారు. ఉస్మాన్‌సాగర్ నుంచి 8,281 క్యూసెక్కులు, హిమాయత్‌సాగర్ నుంచి 10,700 క్యూసెక్కులు, హుస్సేన్‌సాగర్ నుంచి 1,789 క్యూసెక్కుల వరద నీరు మూసీలోకి చేరిందని అధికారులు మంగళవారం వెల్లడించారు.
- Advertisement -