Sunday, December 29, 2024

జలదిగ్బంధంలో సుబ్బక్క పల్లి గ్రామం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం సుబ్బక్క పల్లి గ్రామంలోకి  వరద నీరు చేరడంతో జలదిగ్బంధంలో చిక్కుకుంది.  దీంతో గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యినవి. వరద ఉదృతికి గ్రామంలోకి భారీగా బురద, చెట్ల కొమ్మలు కొట్టుకు వచ్చాయి. అలాగే వరదలో పాములు,జల చరాలు కొట్టుకు రావడంతో ప్రజలు భయబ్రాంతులకు గురైవుతున్నారు. బయటకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు. భారీ వర్షంగా కారణంగా కరెంటు స్థంబాలు కూలి గ్రామంలో కరెంటు సరఫరాకి అంతరాయం కలగడంతో ప్రజలు బిక్కుబిక్కున ఉంటున్నారు. దాదాపుగా చాలా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బయటకు వెళ్దామన్నా దారిలేని పరిస్థితి కొన్నిచోట్ల ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News