- Advertisement -
మహబూబ్ నగర్: జిల్లాలోని జూరాల ప్రాజెక్టు మళ్ళీ భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 11 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 78,000 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 81,067 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 9.275 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 318.330 మీటర్లుగా ఉంది. ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 5 యూనిట్స్ లో 195 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో 5 యూనిట్స్ లో 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.
Heavy flood water inflow in Jurala Project
- Advertisement -