Saturday, November 9, 2024

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు..

- Advertisement -
- Advertisement -

Heavy flood water inflow into Srisailam Project

నాగర్‌కర్నూల్‌‌: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు  వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 2 గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని కిందకు వదిలారు. ఈ ప్రాజెక్టుకు 2,20,810 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 1.22 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడదుల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 883.90 అడుగులుగా ఉన్నది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటినిల్వ 209.1579 టీఎంసీలుగా ఉన్నది. ప్రాజెక్టు కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. ప్రాజెక్టు కుడి, ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు జలకళను సంతరించుకోవడంతో పర్యాటలకు తాకిడి పెరిగింది.

Heavy flood water inflow into Srisailam Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News