- Advertisement -
మహబూబ్‌నగర్: ఎగువ జలాశయాలు నుంచి నీటిని విడుదల చేయడంతో జూరాల ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టుకు 3,86,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, ప్రాజెక్టు సంబందించిన 44 గేట్లు ఎత్తి 4,02,463 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం వైపు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 అడుగులు ఉండగా ప్రస్తుతం ప్రస్తుతం 316.550 మీటర్ల నీటిమట్టం ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టిఎంసిలుకాగా ప్రస్తుతం 6.01 టిఎంసిలు నీటి నిల్వ ఉంది.
- Advertisement -