- Advertisement -
ఐదు గేట్ల ఎత్తి 29 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలిన అధికారులు
కడెంః ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు కడెం ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీవర్షాలకు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో నీటి పారుదల శాఖ అధికారులు బుధవారం ప్రాజెక్ట్ 4 గేట్లను ఎత్తి 24వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్థిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా(7.603 టిఎంసిలుగా) కాగా ప్రస్తుత నీటి మట్టం 695 అడుగులు (6.665 టిఎంసిలు)గా ఉంది. భారీగా వర్షాలకు ఎగువ ప్రాంతం నుండి వరదనీరు 20 వేల క్యూసెక్కులు రావడంతో అప్రమత్తమయ్యారు. గోదావరి పరివాక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రాజెక్ట్‌లో భారీగా నీరు చేరడంతో ఉమ్మడి జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి పర్యాటకులు వచ్చి ప్రకృతి అందాలను తిలకించడంతో పాజెక్ట్‌కు సందర్శకుల తాకిడి పెరిగింది.
- Advertisement -