ఉమ్మడి పాలమూరు జిల్లాకు వర ప్రదాయినిగా ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వరద నీటితో జలకళ సంతరించుకుంది. మహారాష్ట్ర కర్ణాటకలో తెలుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరదలు వస్తున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాములు నిండడంతో అక్కడి నుంచి జూరాలకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆల్మట్టి డ్యాం దగ్గర 97 టీఎంసీల నీరు నిల్వ ఉంచుకుని 65,480 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ప్రాజెక్టుకు 43,478 క్యూసెక్కుల నీరు ఇన్‌ప్లోగా ఉన్నది. నారాయణపూర్ డ్యామ్ దగ్గర పూర్తిస్థాయి నీటి మట్టం 33 టీఎంసీలుగా ప్రస్తుతం
నారాయణపూర్ డ్యామ్‌లో 30 టిఎంసిల నీరు నిల్వ ఉంచుకుని 22 గేట్లను ఓపెన్ చేసి 68,810 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ప్రాజెక్టుకు 62వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ప్లోగా ఉన్నది. జూరాల ప్రాజెక్టు దగ్గర 9 టీఎంసీల నీరు పుల్ కెపాసిటీ కాగా ప్రస్తుతం ఏడు టీఎంసీల నీరు నిల్వ ఉంచుకొని విద్యుత్ ఉత్పత్తి ద్వారా 32,673 క్యూసెక్కుల నీరు, నెట్టెంపాడు లిప్ట్‌కు 1500 క్యూసెక్కులు, భీమాకు 1 కు 1300, భీమా 2 కి 750, సమాంతర కాలువకు 600, లెప్టు కెనాల్‌కు 870, రైట్ కెనాల్‌కు 367 క్యూసెక్కుల నీటిని మొత్తంగా జూరాల నుంచి 37,388 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు 60 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ప్లోగా వస్తున్నది.