Sunday, December 22, 2024

జూరాల ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు

- Advertisement -
- Advertisement -

Heavy flood water to Jurala project

మహబూబ్‌నగర్ : ఎగువ నుంచి  జూరాల ప్రాజెక్ట్ కు భారీగా  వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ఈ ప్రాజెక్ట్ 37 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్ కు 1.61 లక్షల క్యూసెక్కుల నీటి ఇన్ ఫ్లో ఉండగా 1.46 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 8.126 టిఎంసిలుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News