- Advertisement -
హైదరాబాద్: వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో జలాశయాలు నిండుకుండలా మారాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వరద ప్రవాహం ఉండడంతో చెరువు కట్టలు తెగిపోయాయి. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరిందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ జంట రిజర్వాయర్ల గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఉస్మాన్‌సాగర్ నుంచి 2 గేట్లు, హిమాయత్‌సాగర్ నుంచి 2 గేట్లు ఎత్తినట్లు అధికారులు చెప్పారు. ఉస్మాన్‌సాగర్ ఇన్‌ఫ్లో 600 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 422 క్యూసెక్కులు, హిమాయత్‌సాగర్ ఇన్‌ఫ్లో 500, ఔట్‌ఫ్లో 678 క్యూసెక్కులుగా ఉంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
- Advertisement -