- Advertisement -
నిజామాబాద్: ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సూపరింటెండింగ్ ఇంజనీర్ జి శ్రీనివాస్, కార్యనిర్వాహక ఇంజనీర్ ఎం చక్రపాణి తెలిపారు. ఈ ప్రాజెక్టు గేట్ల ద్వారా ఒక లక్ష 75 వేల క్యూసెక్కుల వరద నీటిని సోమవారం సాయంత్రం 5.15 నిమిషాలకు గోదావరి నదిలోకి వదలడం జరుగుతుందన్నారు. కావునా గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా గొర్ల, బర్ల కాపరులు, చేపల వేటకు పోయే మత్స్యకారులు నది లోనికి వెళ్లరాదని విజ్ఞప్తి చేశారు.
- Advertisement -