Sunday, February 23, 2025

ధవలేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక…

- Advertisement -
- Advertisement -

Heavy flooding in Dowleswaram barrage

అమరావతి: గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో ధవలేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 175 గేట్లు ఎత్తి 13 లక్షల క్యూసెక్కుల నీరును సముద్రంలోకి అధికారులు విడుదల చేశారు. అల్లూరి జిల్లా చింతూరు డివిజన్‌లో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దేవీపట్నం మండలం జలదిగ్భందంలో చిక్కుకుంది. 31 గ్రామాల్లోకి నీరు చేరడంతో పోలవరం నిర్వాసితులను ఖాళీ చేయించారు. లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోనసీమ జిల్లాలో గోదావరి నది మధ్యలో పడవ ఆగిపోయింది. రెస్య్కూ సిబ్బంది 15 మంది రైతులను కాపాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News