Monday, December 23, 2024

దివి సీమ, లంక గ్రామాలకు పెరిగిన వరద ఉధృతి

- Advertisement -
- Advertisement -

Heavy floods in Andhra

 

అమరావతి: దివి సీమ, లంక గ్రామాలకు వరద ఉధృతి పెరుగుతోంది. వరద ఉధృతికి పాల ఎడ్లంక వద్ద రహదారి కొట్టుకపోయింది. అవనిగడ్డ-పాత ఎడ్లంక మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కలెక్టర్ అదేశాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గ్రామస్థులను నది దాటించేందుకు రెండు పడవలను ఏర్పాటు చేస్తున్నారు. లంక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాల్లోకి నీరు చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు. కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతి పెరగడంతో లంక గ్రామాలు విలవిలలాడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News