- Advertisement -
కోనసీమ: గోదావరి నడి ఉధృతంగా ప్రవహిస్తోంది. కొత్తగా నీరు వచ్చి చేరుతోంది. దాంతో లంక గ్రామాలు జలదగ్భందనంకు గురయ్యాయి. ముంపులో ఇళ్లు మునిగిపోయాయి. వేల ఎకరాల వరి, ఉద్యానవన పంటలు మునిగిపోయాయి. చాలా గ్రామాలు చెరువుమయం అయిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ముమ్మిడివరం మండలం గరజాపులంక, కూనలంక, లంక ఆఫ్ టానే లంక, చింతపల్లి లంక గ్రామానికి చెందిన వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మేత దొరకక పశువుల డొక్కలు కూడా ఎండుతున్నాయి. కోనసీమలో లేదలేదన్న దాదాపు 75 లంక గ్రామాలు వరద ఉధృతిని ఎదుర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా ధవలేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
- Advertisement -