Sunday, December 22, 2024

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం భారీగా బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారులను బురడి కొట్టించడానికి 23 మంది సూడాన్ మహిళా ప్రయాణికులు గ్రూప్ గా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. బంగారాన్ని వివిధ చోట్ల దాచి తరలించే ప్రయత్నం చేశారు లేడీ కిలాడీలు. కస్టమ్స్ అధికారులకు అనుమానం రావడంతో తనిఖీలు చేపట్టారు. దీంతో సూడాన్ జాతీయులు అడ్డంగా బుక్ అయ్యారు. నిందితుల వద్ద నుంచి 14.906 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.7.90 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారిని అధికారులు విచారిస్తున్నారు. నిందితులు షూకింద ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుని బంగారం తరలిస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News