Sunday, December 22, 2024

శంషాబాద్‌లో భారీగా హెరాయిన్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరో సారి భారీగా డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖతర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడి వద్ద నుంచి 6.75 కెజీల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నా రు. ఆ హెరాయిన్ విలువ దాదాపు 54 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. ఇటీవలి కాలంలో ఎయిర్‌పోర్ట్ నుంచి భారీగా డ్రగ్స్‌ను స్మగ్లర్లు తరలిస్తున్నారు. అధికారుల కళ్లు గప్పి మరీ డ్రగ్స్ తరలింపు జరుగుతోంది. అధికారులు ఎంత అప్రమత్తత పా టించినా డ్రగ్స్ తరలింపుకు పుల్‌స్టాప్ పడటం లేదు. ఈ క్రమంలో అధికారులు నిఘాను ముమ్మరం చేశారు. స్మగ్లర్లు ఏ రీతిలో డ్రగ్స్ తెచ్చినా వాటిని అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తున్నారు. అదే క్రమంలో ఖతర్ నుంచి వచ్చిన ప్రయాణీకుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా.. అతడి వద్ద నుంచి భారీ స్థాయిలో హెరాయిన్‌ను స్వాదీనం చేసుకున్నారు. ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులు విచారణ చేపట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News