Friday, December 20, 2024

పాజెక్టుల అప్పగింతతో రాష్ట్రానికి తీవ్ర నష్టం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : కృష్ణా నదిపై ఉన్న రెండు కీలక ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం కెఆర్‌ఎంబికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బిఆర్‌ఎస్ ఎంసిలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు, లోక్ సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు నేతృత్వంలో ఎంపిల బృందం కలిసింది. ఈ సందర్భంగా తమకున్న అభ్యంతరాలను తెలియజేస్తూ కేంద్ర మంత్రికి లేఖను అందజేశారు. తెలంగాణలోని ప్రాజెక్టులను కెఆర్‌ఎంబి కి అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజల హక్కులకు, మన రాష్ట్రానికి, రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు.ఈ విషయమై పార్లమెంట్‌లో చర్చకు లెవనెత్తుతామని చెప్పారు.

వెంటనే దీనిని ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రిని కోరా రు. కృష్ణా ట్రిబ్యునల్‌లో విచారణ పూర్తయ్యేవ రకు ఇరు రాష్ట్రాలకు 50:50 పద్ధతిలో నీటి కేటాయింపులు ఉం డేలా చూడాలని షెకావత్‌ను కోరినట్లు నామ నాగేశ్వరరావు మీడియాకు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు పోరాడుతామని స్పష్టం చేశారు. గతనెల 27న కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో తెలంగాణ ప్రాజక్టులను కృష్ణా వాటర్ మే నేజ్‌మెంట్ బోర్డుకు అప్పగించాలని తీసుకున్న నిర్ణయం ఇక్కడి ప్రజలకు అమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. కొన్ని న్యాయబద్ధ్ద హక్కులు కోసం పట్టుబడుతున్న ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా ఉందని అన్నారు. ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించడానికి ఆపరేషనల్ ప్రొటోకాల్ ఖరారు చేయాలని, నీటి వాటాలు తేల్చాలని ఇప్పటికే తెలంగాణ కేంద్రానికి లేఖ రాసిందని గుర్తు చేశారు. విద్యుత్ ప్రాజక్టులను భౌగోళిక పద్ధతు ద్వారా నియంత్రించాలని తెలంగాణ పట్టుబట్టిందని చెప్పారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 264 టిఎంసిలు నీటిని సరఫరా చేసేందుకు శ్రీశైలం ప్రాజెక్టు మంజూరు చేసిందని, ట్రి బ్యునల్ అవార్డు ప్రకారం 830 అడుగులని పేర్కొన్నా రు. దీని నుంచి సిడబ్లుసి ఆమోదించిన 34 టిఎంసి మాత్రమే బయటి బేసిన్‌కు మళ్లింపులకు పరిమితమై ఉండేలా కట్టడి చేయాలని కేంద్ర మంత్రికి ఇచ్చిన లేఖ లో పేర్కొన్నట్లు నామా చెప్పారు. కేంద్ర మంత్రిని కలిసిన బిఆర్‌ఎస్ పార్టీ బృందంలో పార్టీ ఎంపిలు జి. రంజిత్ రెడ్డి, బి. వెంకటేష్ నేత, బి. లింగయ్య యాదవ్, ఆర్. సురేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News