Monday, December 23, 2024

డీప్ ఫేక్ వీడియోలు సృష్టించే వారికి భారీ పెనాల్టీలు

- Advertisement -
- Advertisement -

కేంద్ర ఐటి శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో అలజడి సృష్టిస్తున్న డీప్ ఫేక్ వీడియోల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో దీనిపై కొత్త నిబంధనలను తీసుకు రానున్నట్లు కేంద్ర ఐటి శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. డీప్‌ఫేక్ వీడియోలను సృష్టించే వారికి, ఆ వీడియోల వ్యాప్తికి కారణమయ్యే సామాజిక మాధ్యమాలకు భారీ జరిమానా విధించే ఉన్నట్లు యోచనలో తెలిపారు. డీప్ ఫేక్ వీడియోల కట్టడిపై చర్చించేందుకు కేంద్రం గురువారం కీలక సమావేశం నిర్వహించింది. సామాజిక మాధ్యమ సంస్థలు, నాస్కామ్, కృత్రిమ మేధ (ఎఐ)పై పని చేసే నిపుణులతో చర్చించింది.

ఈ సమావేశం అనంతరం కేంద్ర ఐటి శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడారు. మన ప్రజాస్వామ్యానికి డీప్ ఫేక్ పెను ముప్పుగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు.దీన్ని కట్టడి చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు.‘ సామాజిక మాధ్యమ సంస్థలతో సమావేశంలో మేము నాలుగు అంశాలపై కీలకంగా చర్చించాం. డీప్‌ఫేక్‌లను గుర్తించడం, వాటి అరికట్టడం, వాటిని నివేదించడం, అవగాహన కల్పించడం వంటి అంశాలపై చర్చించాం.రాబోయే కొద్ది వారాల్లో దీనికిసంబంధించిన కొత్త నిబంధనలను తీసుకు రానున్నాం. ఆ ముసాయిదా రూపకల్పన నేటినుంచే ప్రారంభిస్తున్నాం. ఇప్పటికే అమలులో ఉన్న కొన్ని నిబంధనలను సవరించడమో లేక కొత్త చట్టాన్ని తీసుకు రావడమో చేస్తాం’ అని కేంద్రమంత్రి వెల్లడించారు.

డిసెంబర్ వారంలో దీనిపై మరోసారి చర్చిస్తామన్నారు. ఇటీవల సినీతారలు రష్మిక, కాజోల్, కత్రినా కైఫ్, సచిన్ తెండూల్కర్ కుమార్తె సారా సహా పలువురు సెలబ్రిటీల డీప్‌ఫేక్ వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో టెక్నాలజీ దుర్వినియోగంపై పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకూడా దీనిపై తీవ్రంగా స్పందించారు.డీప్‌ఫేక్‌లు సమస్యాత్మకంగా మారుతున్నాయన్నారు.దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని మీడియాను కోరారు.ఈ నేపథ్యంలోనే దీనిపై చర్యలకు సిద్ధమయిన కేంద్రం ఈ రోజు సామాజిక మాధ్యమ సంస్థలతో సమావేశమై చర్చించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News