Tuesday, December 24, 2024

బిజెపి ‘దుష్ట రాజకీయాలే’ ఢిల్లీలో కాలుష్యానికి కారణం

- Advertisement -
- Advertisement -

వాయు, నీటి కాలుష్యంపై సిఎం ఆతిశీ ఆరోపణ

న్యూఢిల్లీ : బిజెపి ‘దుష్ట రాజకీయాలే’ ఢిల్లీలో వాయు, నీటి కాలుష్యం పెరుగుదలకు కారణమని ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ ఆదివారం ఆరోపించారు. శీతాకాలం ప్రవేశంతో దేశ రాజధానిలో వాయు నాణ్యత క్షీణించసాగింది. వివిధ ప్రదేశాల్లో, ముఖ్యంగా కాళిందీకుంజ్‌లో యమునా నది ఉపరితలంపై విషపూరిత రసాయనాల నురగ కనిపించడంతో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆప్ పాలిత పంజాబ్‌కు ఆతిశీ క్లీన్ చిట్ ఇచ్చారు. ఢిల్లీలో వాయు నాణ్యత నాసిగా ఉండడానికి బిజెపి పాలిత హర్యానాలో పంట వ్యర్థాల దగ్ధం, డీజెల్ బస్సులు, ఇటుక బట్టీలు కారణమని ఆమె ఆరోపించారు.

ఉత్తర ప్రదేశ్ నుంచి ఢిల్లీ ఘజియాబాద్ సరిహద్దులోని కౌశాంబి బస్సు డిపోకు చేరుతున్న వేలాది డీజెల్ బస్సులు, ఎన్‌సిఆర్‌లో ఇటుక బట్టీలు, ఆ ప్రాంతంలోని థర్మల్ ప్లాంట్లు కూడా ఢిల్లీలో వాయు కాలుష్యానికి కారణభూతం అవుతున్నాయని ఆతిశీ ఆరోపించారు. ‘బిజెపి డర్టీ రాజకీయాలే ఢిల్లీలో పెరుగుతున్న వాయు, నీటి కాలుష్యానికి కారణం. అయితే. అర్వింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ నగర ప్రజలను ఆదుకోవడానికి నిబద్ధమై ఉంది’ అని ఆమె చెప్పారు. పంజాబ్ వ్యవసాయ క్షేత్రాల్లో మంటలు 2021లోని 71300 నుంచి 2023లో 36600కు తగ్గాయని కేంద్ర ప్రభుత్వ డేటా సూచించిందని ఆతిశీ వెల్లడించారు. పంజాబ్ ప్రభుత్వం పంట వ్యర్థాల దగ్ధాన్ని తగ్గించగలిగినప్పుడు హర్యానా, యుపిలోని బిజెపి ప్రభుత్వాలు ఆ పని చేయవచ్చు కదా అని ఆతిశీ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News