Monday, December 23, 2024

గాలివాన బీభత్సం

- Advertisement -
- Advertisement -
  • రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లు
  • విరిగి పడ్డ విద్యుత్ స్తంభాలు
  • విద్యుత్ అంతరాయం

అశ్వారావుపేట రూరల్/అశ్వారావుపేట టౌన్ : మండల కేంద్రం అశ్వారావుపేటతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. అప్పటి వరకూ ఎండతీవ్రతతో ఉక్కిరి బిక్కిరైన ప్రజానీకానికి ఒక్కసారిగా వాతావరణంలో నెలకొన్న మార్పులతో కాస్తంత కుదుట పడ్డారు. ఈదురు గాలుల ప్రభావానికి మండల కేంద్రం అశ్వారావుపేటలో పలుచోట్ల రేకులు ఎగిరి పోయాయి. ఖమ్మం ప్రధాన రహదారిపై వృక్షాలు నేలవాలాయి. ఇదే క్రమంలో నారంవారిగూడెం, అచ్యుతాపురం, ఊట్లపల్లి, మల్లాయిగూడెం, రామన్నగూడెం, ఆసుపాక, నారాయణపురం, వినాయకపురం తదితర గ్రామాల్లో గాలి ప్రభావంతో చెట్లు కొమ్మలు విరిగి రోడ్డుకు అడ్డంగా చెట్లు పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరికొన్ని చోట్ల మల్లాయిగూడెం, రామన్నగూడెంలో ఇళ్ళపై చెట్లు పడ్డాయి. వీటితో పాటు సాగులో ఉన్న అరటి తోటలు పలుచోట్ల నేలవాలాయి. విద్యుత్ స్తంభాలు కుప్పకూలడంతో అశ్వారావుపేట పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ పునరుద్ధరించేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News