Sunday, November 24, 2024

కుండపోత

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : మేఘాలు గర్జించాయి.. వర్షాలతో తెలంగాణ రాష్ట్రం తడిసిముద్దగా మా రింది. భారీ వర్షాల వల్ల పలు జిల్లాల్లో వాగులు వంకలు ఉప్పొంగాయి. వరదనీరు వంతెనలెక్కి ప్రవహించింది. రాకపోకలను స్తంభింపజేసింది. వర్షపునీటి ఉధృతికి వివి ధ ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురయ్యాయి. ఏకధాటిగా కురిసిన వర్షం పంటచేలను నీట ముంచెత్తింది. మినుము, పెసర తదతర పప్పుధాన్య పంటలు నీటమునిగాయి. పూత దశలో ఉన్న సోయా పంటలకు కూడా నష్టం వాటిల్లింది. మరో వైపు నెలరోజులుగా వర్షాల జాడా లేకపోవటంతో నేలలో చెమ్మలేక వాడు పట్టన పంటచేలకు తాజా వర్షం ప్రాణం పోసింది. గత 24గంటలుగా రాష్ట్రంలో ఒక మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఖరీఫ్‌లో సాగు చేసిన పంటపోలాలు బెట్ట నుంచి తేరుకుంటున్నాయి. రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసింది. నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ , వికారాబాద్, మంచిర్యాల, కరీంనగర్ , సిద్దిపేట జిల్లాల్లో కనిష్టంగా 64నుంచి గరిష్టంగా 101 వర్షం కురిసింది. మరో 186 ప్రాంతాల్లో 33నుంచి 64 మి.మి వర్షం కురిసింది.

పలు జిల్లాల్లో కుండపోత వర్షం కారణంగా లోతట్టు కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. భారీ వ ర్షాల కారణంగా నిజామాబాద్ జిల్లాలో విద్యాసంస్థలకు ప్రభుత్వ సెలవు ప్రకటించింది. జుక్కల్ బస్వాపూర్ మద్య రోడ్డు కోతకు గురికావడంతో ఈ మా ర్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. డిచ్‌పల్లినిజామాబాద్ మధ్య రాకపోకలు స్తంభించా యి. జక్రాన్‌పల్లి , డిచ్‌పల్లి, మోపాల్, నిజామాబాద్ రూ రల్, దర్పల్లి , ఇందల్వాయి మండలాల్లో భారీ వర్షాలతో వాగులు వంకలు ఏకమైపారుతున్నాయి. చెరువుల్లో వరదనీరు అలుగెలెక్కిపారుతోంది. సిరికొండ మండలంలో కప్పలవాగు పొంగి ప్రవహిస్తోంది. ఎల్ల మ్మ చెరువు ప్రమాదకర పరిస్థిలోకి వెళ్లటంతో గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. ఇసుక నింపిన బస్తాలతో వరదనీరు గ్రామంలోకి రాకుడా అడ్డువేశారు. జుక్క ల్ నియోజకవర్గంలోని కౌలాస్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేసి దిగువను నీటిని విడుదల చేస్తున్నారు. డోగ్లి మండంలో భారీ వర్షం వల్ల పొలాల్లోనీరు నిలిచింది. ఆర్మూరు ప్రాంతంలో భారీ వర్షానికి లోతట్టు కాలనీల్లోకి వర్ష పు నీరు చేరింది. సదాశివనగర్ మండలంలో యాచా రం, ఉత్తునూర్, ధర్మారావు పేట, అమర్లబండ గ్రా మాల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉత్తనూర్ గ్రామం వద్ద ఆర్టీసిబస్సు వరదనీటిలో చిక్కుబడిపోయింది.

కామారెడ్డి జిల్లాలో గాంధారి వాగు పో టెత్తడంతో పంట పొలాలు ముంపునకు గురయ్యా యి. పశువులకోసం వెళ్లిన రైతు వాగులో చిక్కుబడగా ప్రత్యేక బోటు సాయంతో అతన్ని కాపాడారు. భారీ వర్షాల కారణంగా సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాం తాల్లో ఇళ్లలోకి వరదనీరు చేరింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ,కోరుట్ల , ప్రాంతాల్లోని లోతట్టు కాలనీల్లోని వరదనీరు చేరింది. వికారబాద్ నియోజకవర్గంలో వా గులు వంకలు పొంగిపొర్లాయి. గొట్టిముక్కల , గోధు మ గూడ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో భారీవర్షం కురిసింది. సోమవా రం కురిసిన వర్షానికి వాగులు వంకటు పొంగిప్రవహిస్తున్నాయి. సూర్యాపూర్ చెరువుతోపాటు ఆందకూర్ చెరువుల్లోకి భారీగా వరదనీరు చేరుతోంది. క ల్లూరు చెక్‌డ్యాం మీడుగా వరద నీరు ఉధృతంగా ప్ర వహిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి వర్షపు నీరు చేరటంతో పలు మార్గాల్లో ట్రాఫిఖ గంటల తరబడి స్తంభించిపోయింది. రాష్ట్రమంతటా విస్తారంగా కురిసిన వర్షాలతో వ్యవసాయరంగం కుదుట పడుతోంది. ప్రాజెక్టులకు , చెరువులకు భారీగా వరదనీరు చేరటంతో ఖరీఫ్ పంటలకు ఢోకా వుండదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మొరంగపల్లి బ్రిడ్జి వాగులో నిలిచిన బస్సు
మోమిన్‌పేట్‌లో.. గత రెండు రోజుల నుంచి కురిసిన వర్షాలకు వికారాబాద్ జిల్లాలోని మోమిన్‌పేట మొ రంగపల్లి రైల్వే వంతెన వద్ద వర్షపు నీరు నిలిచింది. దీంతో సోమవారం అటుగా వెళ్లిన ఆర్టీసి బస్సు వర్షపు నీటిలో నిలిచిపోవడంతో అందులోని ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. వర్షపు నీటిలో బస్సు సగం వరకు మునిగిపోయింది.
తెగిన సింగూర్ కెనాల్ కాలువ
పుల్కల్: పుల్కల్ మండలంలో సోమవారం ఉదయం మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి చెరువులు కుంటలు పొంగి పొర్లుతున్నా యి. అలాగే సింగూరు ఎడమ కాలువ ద్వారా వ్యవ సాయానికి నీరు విడుదల చేయడంతో ఆ కాలువ నిండుకుండలా పారుతుంది. సోమవారం నాడు పు ల్కల్ మండల పరిధిలోని ఇసోజిపేట్ గ్రామ శివారు లో ఉన్న సింగూరు పెద్ద కాలువ ఒక్కసారిగా తెగిపో వడంతో అట్టి నీరు గ్రామ పెద్ద చెరువులోకి ప్రవహి స్తుండడంతో ఇప్పటికే నిండుకుండలా ఉన్న చెరువు ఎక్కడ తెగిపోతుందోనని తమ పంట పొలాలు ఎక్కడ నీట మునిగిపోతాయో అన్న భయం గ్రామ రైతుల్లో నెలకొంది. తమ చెరువు కనుక తెగిపోతే వందల ఎక రాల వరి పంట కొట్టుకుపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు భయపడుతున్నారు. ఈ విషయాన్ని తె లుసుకున్న అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అక్కడికి వెళ్లి చెరువు కట్టను పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News