మన తెలంగాణ/హైదరాబాద్: ఉపరితల ఆ వర్తనం విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో స ముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5కి.మీ. మ ధ్య ఏర్పడింది. కిందిస్థాయిలో గాలులు పశ్చి మ, నైరుతి దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రా గల 24గంటల్లో ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వా తావరణ కేంద్రం వెల్లడిచింది. కొన్నిచోట్ల ఉ రుములు, మెరుపులు గంటకు 40 కిలో మీ టర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో భా రీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపిం ది.
అదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, జిల్లాలలకు ఎల్లో అలర్ట్ ప్రక టించింది. ఉత్తర తెలంగాణతో పాటు సెంట్ర ల్ తెలంగాణ, దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ నెల 27వరకూ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంంద్ర వెల్లడించింది. శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి.