Tuesday, November 5, 2024

ఉత్తరాఖండ్‌ లో భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  గత రెండు రోజులుగా ఉత్తరాఖండ్‌  రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా  కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడటంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో అనేక మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. రుషికేశ్‌ కు 40 కిలోమీటర్ల దూరంలో వేలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు.

యాత్రికులు, స్థానికులు రోడ్డుపైనే గంటల తరబడి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. తిరుగు ప్రయాణంలో వారంతా అక్కడ చిక్కుకుపోయారు. మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈమేరకు రాష్ట్రంలోని డెహ్రాడూన్, పౌరీ గర్వాల్, రుద్రప్రయాగ, ఉత్తరకాశీ, చమోలీ, తెహ్రీ,  పితోర్‌గఢ్‌ సహా పలు జిల్లాలకు మంగళవారం వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News